ఘన్పూర్ స్టేషన్: స్టేషన్ ఘన్ పూర్ : అకాల వర్షానికి కృష్ణాజిగూడ గ్రామంలో తడిసిన రైతుల వరి ధాన్యం
చిలుపూర్ మండలం క్రిష్ణాజీగూడెం గ్రామంలో కురిసిన అకాల వర్షానికి రైతుల వరి ధాన్యం తడిసి ముద్దయింది. శనివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి దాన్యపు రాశులు తడిసి ముద్దయ్యాయి. పిఎసీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ధాన్యాన్ని వారం రోజులుగా ఉండబోశారు .సకాలంలో కాంటాలు వేయకపోవడంతో కళ్ళాల్లోనే ఉన్న ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.