రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కానుకుంట ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నంఅగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మున్సిపల్ సిబ్బంది సమీపంలోని చెత్తకు నిప్పంటించగా, ఆ మంటలు అదుపు తప్పి సమీపంలోని కట్టెల దుకాణం, అఫ్రోజ్కు చెందిన మెకానిక్ గ్యారేజ్ వరకు వ్యాపించాయి. కట్టెలు, ఆయిల్, టైర్లు వంటి దహన పదార్థాలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనలో గ్యారేజీలో ఉన్న స్టాక్ మొత్తం కాలిపోయి బూడిదయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.