మహాశివరాత్రి సందర్బంగా భక్త జనసంద్రమైన కోటిపల్లి క్షేత్రం
కె.గంగవరం మండలం కోటిపల్లి శ్రీ సోమేశ్వరాలయం మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది. పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించి భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భక్తులు కోటిపల్లి క్షేత్రానికి వచ్చి శివుడిని దర్శనం చేసుకుంటున్నారు. ఆలయ పరిసరాలలో ఓం నమశ్శివాయ నామస్మరణతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.