నిర్మల్: సోన్ మండల కేంద్రంలో ఘనంగా జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు, నివాళులర్పించిన బీజేపీ నాయకులు
Nirmal, Nirmal | Jul 6, 2025 శ్యాంప్రసాద్ ముఖర్జీ సేవలు మరువలేనివి దేశంలో ఒకే పౌరసత్వం, కాశ్మీర్ అవరోధంగా ఉన్న ఆర్టికల్ 370 రద్దు కోసం శ్యాం ప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా కృషి చేశారని బీజేపీ మండల అధ్యక్షులు మార గంగారెడ్డి అన్నారు. సోన్ మండల కేంద్రంలో జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దేశం నుంచి కాశ్మీర్ ను విడదీసేందుకు ఉన్న ఆర్టికల్ 370 రద్దు కోసం 1953లోనే శ్యాంప్రసాద్ ముఖర్జీ పోరాడారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేష్, సంతోష్, గంగారెడ్డి, నర్సయ్య, మల్లేష్, గణేష్, అమృత్, కళ్యాణ్, వెంకట నర్సయ్య,