రాయదుర్గం శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి కి భక్తుడు ఎం.నారాయణ రాజు పంచలోహ వరాహ కవచం కానుకగా సమర్పించారు. సోమవారం ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చైర్మన్ గాజుల వెంకటేశులు, అర్చకులు బాలమురళీ కృష్ణ బట్టార్ లకు తన కుమారుడు పవన్ రాజ్ తో కలిసి ఈ ఈ కానుక సమర్పించి తన భక్తిని చాటుకున్నారు. శ్రీవారికి ప్రతీ ఏడూ వివిధ రకాల కానుకలు సమర్పిస్తూ వస్తున్నట్లు భక్తుడు నారాయణ రాజు తెలిపారు.