గంగాధర నెల్లూరు: పాలసముద్రం పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే థామస్
పాలసముద్రం మండలం పాలసముద్రం పంచాయతీలో రూ.66 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను ఎమ్మెల్యే థామస్ సోమవారం ప్రారంభించారు. ఆయనకు టీడీపీ నేతలు, గ్రామస్థులు గజమాలతో సత్కరించి పూలబాట వేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తాళ్లూరి శివ, పెనుమూరు మార్కెటింగ్ కమిటీ వైస్ ఛైర్మన్ అరుల్ నాదన్, ఎంపీడీవో సతీశ్, మాజీ ఎంపీపీ ఇందిరమ్మ, శేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు.