అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ప్రసన్నాయిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న బెస్త సేవా సంఘం కమ్యూనిటీ హాల్ వద్ద గురువారం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి సందర్భంగా భీష్మ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బెస్త సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని ఇప్పటికైనా భీష్మ ని గొప్పతనాన్ని తెలుసుకొని ప్రభుత్వమే భీష్మ ఏకాదశి నిర్వహించాలని తాము డిమాండ్ చేస్తున్నామని బెస్త సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ పేర్కొన్నారు.