ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామంలో అనకాపల్లి జిల్లా రైతు సంఘం కార్యదర్శి అప్పలరాజుని విడుదల చేయాలని స్థానిక రైతు సంఘం నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ అప్పలరాజు పై అన్యాయంగా పెట్టిన పీడీ యాక్ట్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దుర్మార్గమైన రెస్టును ఉపసంహరించుకోవాలని లేకపోతే రాబోయే కాలంలో ఆందోళన చేయాల్సి వస్తుందన్నారు.