శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామంలో వెంకటేష్ అనే చిన్నారిపై వీధి కుక్క విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. తీవ్ర గాయాల పాలైన చిన్నారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.