వీ.కోట: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలోని కురబల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారన్నారు. రాష్ట్రంలో తన తండ్రి కాలం నుండి నేటి వరకు దాదాపు 14మంత్రి పదవులను తెదేపా ప్రభుత్వం కురబలకు అందించడం గర్వకారణం అన్నారు. అదే స్ఫూర్తితో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు కురుబల సంక్షేమానికి అనేక విధాల సహకరిస్తున్నారని కొనియాడారు. ప్రతి ఒక్క కురబ విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మెరుగైన స్థానాలకు చేరుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. అందివచ్చే ప్రతి అవకాశాన్ని కురబలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.