నంద్యాల జిల్లా డోన్‌లోని శ్రీ మద్దిలేటి స్వామి దేవస్థానంలో ఈ నెల 28 నుంచి జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ ప్రకాశ్ రెడ్డికి ఆహ్వానం అందింది. బుధవారం ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు, వేద పండితుల ఆధ్వర్యంలో కోట్లకు ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం స్వామి వారి చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.