మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తిరుమలగిరి కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సిఐ అజయ్ కుమార్ ముగ్గురు ఎస్సైలు 20 మంది పోలీసులతో జల్లడ పట్టారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేకపోవడంతో 20 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల గంజాయి వాడకం ఎక్కువగా ఉండటం అక్రమ రవాణా జరుగుతుండడం బైకు దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా తనిఖీలు నిర్వహించినట్లు సీఐ అజయ్ కుమార్ తెలిపారు.