మధిర: ఎర్రుపాలెం మండలం జమలాపురంలో ఘనంగా వకులా మాత కళ్యాణం
శుక్రవారం ఎర్రుపాలెం మండలం జమలాపురం క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన వకుళ మాత కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో పట్టు వస్త్రాలు సమర్పించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి పాల్గొన్నారు.వేలాది మంది భక్తులు కళ్యాణంలో పాల్గొన్నారు.