జడ్చర్ల: జిల్లాలో ఇటీవల అబార్షన్ కారణంగా మృతి చెందిన మహిళ విచారణలో భాగంగా మిడ్జిల్ మండల కేంద్రంలో ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
మిడ్జిల్ మండలం వేముల గ్రామానికి చెందిన జయలక్ష్మి అనే గర్భిణీ అబార్షన్ చేయాలంటూ మండల కేంద్రంలోని ఓ ఆర్ఎంపీ డాక్టర్ని కలవడంతో జిల్లా కేంద్రానికి రిఫర్ చేశాడు. కాగా జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అబార్షన్ చేసిన అనంతరం తీవ్ర రక్తస్రావంతో మహిళ మృతి చెందింది. దీంతో సంబంధిత వైద్య అధికారులు విచారణ చేయడంతో మిడ్జిల్ మండల కేంద్రంలోని ఆర్ఎంపీ డాక్టర్ రమేష్ కారణం అని తెలియడంతో అతని ఆసుపత్రిని సీజ్ చేశారు జిల్లా మరియు మండల వైద్య అధికారులు.