చీమకుర్తి పట్టణంలో కొలువైన శ్రీ సాయి బాబా సత్సంగ కార్యక్రమాన్ని వెద పండితుల ఆధ్వర్యంలో ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చీమకుర్తి పట్టణంలోని భక్తులు పెద్ద సంఖ్యలో బాబా సత్సంగ కార్యక్రమానికి తరలివచ్చి బాబాను దర్శించుకుని పూజలు చేశారు. బాబా చూపిన మార్గమే సాయి పథం అని, బాబా చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని పండితులు భక్తులకు సూచించారు. కార్యక్రమం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.