గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. రూ.44 లక్షల విలువైన నకిలీ నోట్లను అక్రమంగా తరలిస్తున్న గుజరాత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు ఓ నైజీరియన్ పౌరుడిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న వారిని అడ్డుకొని తనిఖీ చేయగా, భారీ మొత్తంలో నకిలీ కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయి. ఈ నకిలీ నోట్లను నగరంలోకి తరలించి చలామణి చేయాలనే ఉద్దేశంతో వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నరు.