డోన్ లో బిజెపి ఆధ్వర్యంలో ఇంటస్వదేశీ _ఇంటింటా స్వదేశీ కార్యక్రమం
Dhone, Nandyal | Nov 5, 2025 నంద్యాల జిల్లా డోన్లో ప్రతి ఇంట స్వదేశీ-ఇంటింట స్వదేశీ కార్యక్రమంలో భాగంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తకాపు హేమసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వదేశీ ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. విదేశీ వస్తువులు వినియోగించడం వల్ల దేశ ఆర్థికాభివృద్ధి దెబ్బతింటుందన్నారు. స్వదేశీ ఉత్పత్తులు వినియోగించడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందన్నారు.