ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి జంగమ నేతలు ఘన సన్మానం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి జంగమ నేతలు ఆదివారం ఘనంగా సన్మానించారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శ్రీశైల దేవస్థానంలో మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం కు విచ్చేసిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ని జంగమ నేతలు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జంగమ కుల కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇప్పించేందుకు కృషి చేసినందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జంగమ కార్పొరేషన్ చైర్మన్ వాసునూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు