కోడూరు: మహిళను ఢీకొన్న కారు - పరిస్థితి విషమం
కోడూరు మండలం రాఘవరాజుపురం పంచాయతీ పరిధిలోని ప్రధాన జాతి రహదారిపై అర్ధరాత్రి యాక్సిడెంట్ జరిగింది. బాల్రెడ్డి పల్లికి చెందిన గంగమ్మ తిరుపతి నుంచి కారులో వచ్చి దిగి రోడ్డు దాటుతుండగా మరో కారు ఢీకొంది. దీంతో ఆమె గాల్లోకి ఎగిరి పడింది. ప్రస్తుతం ఆమె తిరుపతిలో చికిత్స పొందుతుందని పరిస్థితి విషమంగా ఉందని బంధువులు తెలిపారు.