గొల్లపల్లి: తండ్రి సమాధికి రాఖీ కట్టిన కూతురు...
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం భీంరాజ్‌పల్లి గ్రామానికి చెందిన బొమ్మెన మాధవి తన తండ్రి రాజయ్య సమాధికి రాఖీ కట్టి తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని గుర్తుచేసింది. రెండేళ్ల క్రితం తన తండ్రి రాజయ్య హఠాన్మరణం చెందారు. ఏటా తన తండ్రికి కూతురు రాఖీ కట్టడానికి వెళ్లేది. కాని తండ్రి మరణం తర్వాత భౌతికంగా లేకపోవడంతో సమాధి వద్దకు వెళ్లి రాఖీ కట్టింది. ఈ దృశం పలువురికి కంటతడి పెట్టించింది. మాధవి తన తండ్రి సమాధికి రాఖీ కట్టడంతో రక్షాబంధన్‌కు ఉన్న గొప్పతనాన్ని చాటి చెప్పింది.