శ్రీకాళహస్తి: పట్టణంలోని ద్రౌపతి సమేత ధర్మరాజు స్వామి బ్రహ్మోత్సవాల్లో తప్పిపోయిన బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన CI తిమ్మయ్య
శ్రీకాళహస్తి: తప్పిపోయిన బాలుడిని అప్పగించిన సీఐ శ్రీకాళహస్తిలో ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వీటిని వీక్షించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. చిల్లకూరు మండలం రెట్టపల్లి చెందిన పసుపులేటి స్వామి, కల్పన కుటుంబ సమేతంగా దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో వారి కుమారుడు కార్తికేయ తప్పిపోయాడు. బీఎన్ కండ్రిగ సీఐ తిమ్మయ్య సమాచారం అందుకొని బాలుడిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.