ఇబ్రహీంపట్నం: దూంపేట వద్ద కారు ఢీకొని పోతారం గ్రామానికి చెందిన వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కథలాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన నాగేల్లి రాజ మల్లయ్య (55) ఆదివారం రాత్రి కోరుట్ల పట్టణానికి బైక్పై వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో కథలాపూర్ మండలం దుంపేట వద్ద కారు ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన రాజ మల్లయ్యను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.