మాకవరపాలెం మండలంలో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు రెవెన్యూ అధికారులు అండతో టీడీపీ నేతలు కుట్ర,మాజీఎమ్మెల్యే ఆరోపణ
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మాకవరపాలెం మండలంలో సుమారు 400 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు రెవెన్యూ అధికారుల సహకారంతో టిడిపి నాయకులు ప్రయత్నిస్తున్నారని ఎందుకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సోమవారం మాకవారిపాలెంలో విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.