మల్యాల: భారీ వర్షాలతో తాటి పెళ్లి గురుకుల పాఠశాల విద్యార్థులను 3 రోజులపాటు సెలవులు
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతోజగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటి పెళ్లి బాలికల గురుకుల పాఠశాలకు మూడు రోజుల సెలవు ప్రకటించి పాఠశాల,కళాశాలలో విద్యార్థులను ఇంటికి పంపించారు. ప్రస్తుతం పాఠశాలలో 475, కళాశాలలో 171 మంది విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థులను ఇంటికి పంపించినట్లు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సిబ్బంది ఓ ప్రకటనలో తెలిపారు.