పుట్టపర్తి లోని ప్రశాంతి నిలయంలో చతుర్వేద స్వర సంగ్రామం
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరుగుతున్న సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం చతుర్వేద స్వర సంగ్రామం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సత్య సాయి పూర్వ విద్యార్థులు, మహిళలు, పురుషులు కలిసి 1,800 వేదాలను భక్తులకు వినిపించారు. ఈ వేద పఠనం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో దేశ విదేశీ భక్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.