పలమనేరు: ఇండస్ట్రీయల్ ఎస్టేట్ లో పేపర్ ప్లేట్స్ తయారు చేసే గోడౌన్ యజమాని ఖాజా మీడియా తెలిపిన సమాచారం మేరకు. ఎస్టేట్లోని తన పేపర్ ప్లేట్ల తయారీ ఫ్యాక్టరీని క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు బద్దలుకొట్టి విలువైన యంత్రాలు, సామగ్రి, నగదు దోచుకెళ్లారన్నారు. వీటి విలువ సుమారు రూ.7 లక్షల దాకా ఉంటుందన్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఉన్నాము తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు.