ప్రకాశం జిల్లా పొదిలిలో ఆర్యవైశ్య సంఘం పిలుపుమేరకు వ్యాపారస్తులు ఆర్యవైశ్యులు బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపారు. షాపులన్నీ స్వచ్ఛందంగా మూసివేసి అమ్మవారి శాల బజార్ నుండి చిన్న బస్టాండ్ వరకు శాంతియుతంగా ర్యాలీ చేపట్టారు. ముందుగా మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కోటేశ్వరరావు అవినాష్ లపై పోలీసుల చర్యను ఖండించారు. ఆర్యవైశ్యుల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలతో హోరెత్తించారు