పూతలపట్టు: తవణంపల్లి మండలం జొన్నగురకల పరిధిలోని గొడ్డువంక కాజ్వే పై పాచి ప్రయాణికులకు ప్రమాదాలు
తవణంపల్లి మండలం—జొన్నగురకల గ్రామపంచాయతీ పరిధిలోని గొడ్డువంక కాజ్వే స్థానికులకు, ప్రయాణికులకు ప్రమాదాల హాట్‌స్పాట్‌గా మారింది. అరగొండ–జొన్నగురకల– బంగారుపాళ్యం రహదారిపై ఉన్న ఈ కాజ్వే మీద ఏడాదిలో దాదాపు ఆరు నెలలు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. భారీ వర్షాలు కాకపోయినా, పరిసర అడవుల నుంచి వచ్చే ఊటు నీరు వల్ల కాజ్‌వేపై పాచి పేరుకుని స్వల్ప జారుడు ప్రమాదాల నుంచి పెద్ద ప్రమాదాల వరకు చోటు చేసుకుంటున్నాయి. స్థానికులు జాగ్రత్తగా ప్రయాణిస్తున్నా కూడా పదుల సంఖ్యలో వాహనాలు జారిపడటం, కొత్తవారైతే మరింత ప్రమాదంలో పడటం సాధారణమైంది. కాణిపాకం, అర్ధగిరి దేవాలయాలకు వెళ్లే భక్తులు కూడా తరచూ ఇబ్బందుల