నాగారం: ఇండ్లు మంజూరు చేయాలని నాగారం ఎంపీడీవోకు వినతి
అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నాగారం ఎంపీడీవో మారయ్య కు వినతిపత్రం అందించారు. నాగారంలో మంజూరైన 24 ఇండ్లకు అదనంగా మరొక 100 ఇండ్లు మంజూరు చేసి అర్హులైన వారికీ మంజూరు చేయాలని బి ఆర్ ఎస్ శ్రేణులు కోరారు. ఎన్నికల్లో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలన్నారు.