జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నీటిపారుదల సలహా మండలి సమావేశం ,పాల్గొన్న మంత్రులు ,ఎమ్మెల్యేలు ,ప్రజాప్రతినిధులు అధికారులు
Nandyal Urban, Nandyal | Dec 2, 2025
నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్ ఎమ్మెల్యేలు బుడ్డ రాజశేఖర్ రెడ్డి, జయ సూర్య, గౌరీ చరిత, భూమా అఖిలప్రియ, జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రబీ కాలంలో రైతలు వేసే పంటలకు కేసీ కెనాల్, తెలుగంగ, ఎస్ఆర్బిసి కాల్వల ద్వారా ఏ విధంగా నీళ్లు ఇవ్వాలో చర్చించుకున్నామన్నారు. ఎస్ఆర్బిసి చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు వరి పంటనే కాకుండా మిగత పంటలు కూడా వేసుకోవ