కమలాపురం: కమలాపురం : వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఇస్మాయిల్ నియామకం
కడప జిల్లా కమలాపురానికి చెందిన మైనారిటీ యువనాయకుడు ఇస్మాయిల్ వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఆదివారం నియమితులయ్యారు.ఈ సందర్బంగా ఇస్మాయిల్ మాట్లాడుతూ తాను శక్తివంచన లేకుండా పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు. తనను వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఎంపిక చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి, కడప ఎంపీ వైఎస్.అవినాష్ రెడ్డికి, కమలాపురం ఇంఛార్జ్ నరేన్ రెడ్డికి, పార్టీ అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.