భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట, రేగొండ చిట్యాల,భూపాలపల్లి మండలాల్లో శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 191 మందికి 61 లక్షల పదివేల 500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించినట్లు ఎమ్మెల్యే గండ్ర తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని,ఈ నేపథ్యంలోనే పలు మండలాల్లోని లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.