పామూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎంపీపీ గంగసాని లక్ష్మి అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... పామూరు మండలంలో తాగునీరు, విద్యుత్, రహదారులు వంటి మౌలిక వసతులపై అధికారులు దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. మండల స్థాయిలో పరిష్కారం కానీ సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.