రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లాలో రాబోయే ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషన్ వివరాలను అసెంబ్లీలో వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి
రంగారెడ్డి జిల్లాలో మెట్రో విస్తరణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. దీనిలో భాగంగా శంషాబాద్ మెట్రో, మియాపూర్ నుంచి పటాన్చెరువు, నాగోల్ నుండి ఎల్బీనగర్, ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ వరకు పెట్రోలు విస్తరించాలని ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. నాగోల్, ఎల్బీనగర్, చంద్రయాన్ గుట్ట స్టేషన్లలో ఇంటర్ చేంజ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.