చేవెళ్ల: ధర్మసాగర్ లో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నేలకొరిగిన పోప్పడి పంట
చేవెళ్ల మండలంలోని ధర్మసాగర్ గ్రామంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పొప్పడి పంట నేలకొరిగింది. రైతు గుర్రాల జస్వంత్ రెడ్డి తన మూడు ఎకరాల పొలంలో వేసిన పొప్పడి పంట కాయలు చెట్ల తో సహా విరిగిపడ్డాయి. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ రూపాయలు ఐదు నుంచి ఆరు లక్షల వరకు తనకి నష్టం జరిగిందని, అధికారులు తనని ఆదుకోవాలని వేడుకున్నారు.