ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని అనుమలవీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం భోజన పథకాన్ని మండల విద్యాశాఖ అధికారి గిరిధర శర్మ మరియు ఎంపీడీవో వెంకటరామిరెడ్డి పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తుంది ఆహారం నాణ్యతను పరిశీలించి ఆహారాన్ని భుజించి రుచిని చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలని ఆహారం ఉండేటప్పుడు శుభ్రత పాటించడంతోపాటు ఎప్పటికప్పుడు వేడిగా ఉండేలా చూడాలని అధికారులు సిబ్బందికి తెలిపారు.