దేశ రక్షణలో సైనికులు, మాజీ సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో.. సాయుధ దళాల పతాక నిధికి తన వంతు విరాళాన్ని హుండిలో వేసి..సాయుధ దళాల పతాక దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా సైనిక సంక్షేమ అధికారి పి.తిమ్మప్ప జిల్లా కలెక్టర్ఆనంద్ కు పుష్పగుచ్ఛం అందించి, కలెక్టర్ చొక్కా జేబుపై గౌరవ సూచకంగా ఆర్మీ సాయిధ దళాల పతాక నిధి స్టికర్ ను అతికించి, విరాళాన్ని అందించినందుకు, అర్హులైన మాజీ సైనికులకు భూమి కేటాయింపుకు చర్యలు తీసుకోవాలన్నారు.