నంద్యాల జిల్లాఆళ్లగడ్డ ఆల్ఫా కాలేజ్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్ వాహనాలను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ జగత్ విఖ్యాత రెడ్డి అడ్డుకున్నారు, సరైన పత్రాలు లేకుండా కంటైనర్ లో లారీల్లో గోవులను కుక్కి తరలిస్తున్నారని ఐదు వాహనాలను గుర్తించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు,ఒక్కొక్క కటైనర్ లో 70 పైగా గోవులలో తరలిస్తున్నారని ఎమ్మెల్యే అఖిల ప్రియ తెలిపారు, తెలంగాణ నుంచి కడప జిల్లాకు రవాణా చేస్తున్నట్లు పేర్కొన్నారు, ఇలాంటి అక్రమాలను సహించబోమని ఎమ్మెల్యే హెచ్చరించారు, ఇవి ఎవరివి ఎక్కడికి తరలిస్తున్నారు తప్పక బయటికి రావాలని ఎమ్మెల్యే అన్నారు