పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివని అవుకు రైస్ మిల్ యజమాని శంకర్ పేర్కొన్నారు. బుధవారం అవుకు పంచాయతీ కార్మికులు 23 మందికి క్రిస్మస్ సందర్భంగా ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, కందుల బ్యాగ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల పరిశుభ్రతకు పారిశుద్ధ్య కార్మికులు ప్రముఖ పాత్ర వహిస్తున్నారని ఆయన కొనియాడారు.