కర్నూలు టూ బళ్ళారి హైవే ఏర్పాటు చేయాలని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్.హెచ్.ఏ.ఐ) చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ ను కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కోరారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో పాల్గొంటున్న ఎంపీ, ఢిల్లీలోని ఎన్.హెచ్.ఏ.ఐ కార్యాలయంలో ఆయనను కలిసి వినతి పత్రం సమర్పించారు...ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానించే కర్నూలు బళ్ళారి హైవే ఏర్పాటైతే వాణిజ్యం, పర్యాటకం, ప్రాంతీయ అభివృద్ధికి దోహదం చేస్తుందని వివరించారు..హైవే ఏర్పాటు పై చైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ నాగరాజు తెలిపారు