అమరచింత: మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో తాగుబోతుల వీరంగం, స్కూలు బెంచీలు, కిటికిలు ధ్వంసం చేసిన మందుబాబులు
వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో నిప్రభుత్వ పాఠశాలలో తాగుబోతులు వీరంగం సృష్టించారు. రెండు రోజులు సెలువులు ఉండడంతో అక్కడికి మద్యం సేవించడానికి చేరుకున్న తాగుబోతులు పాఠశాలలో ఉన్న స్కూల్ టేబుల్స్, పాఠశాల కిటికీలు విరగొట్టారు. ప్రతిరోజు పాఠశాల పూర్తయ్యాక రాత్రివేళల్లో ఇక్కడ చెప్పుకోలేని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరించడం తమను ఆశ్చర్యానికి గురిచేస్తుందని వెల్లడించారు.