రాయదుర్గం: పట్టణంలోని 21,17 వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవశ్రీనివాసులు అన్నారు. శుక్రవారం రాయదుర్గం పట్టణంలోని 21, 17 వార్డులలో రూ. 56.50 లక్షలతో నిర్మిస్తున్న సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి అధికారులతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం టిడిపి కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్ లో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయదుర్గంలో ఇప్పటికే రూ. 4 కోట్లు విలువైన పనులు పూర్తి అయ్యాయని త్వరలో మరో 3 కోట్లు పనులు జరుగుతున్నాయన్నారు.