ఒంగోలు: చీమకుర్తిలో డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి పురపాలక సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన ఒంగోలు MLA బాలినేని శ్రీనివాస్ రెడ్డి
ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా మహిళలకు నాలుగు విడతల్లో రుణాలు రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే దక్కుతుందని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చీమకుర్తిలో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పురపాలక సంఘ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే బాలినేని, మంత్రి మేరుగు నాగార్జున రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.