చంద్రశేఖరపురంలో కొలువైన శ్రీ కామాక్షి సమేత చంద్రమౌలేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం హుండీలో నగదు చోరీకి గురైంది. గమనించిన ఆలయ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన ఎస్సై వెంకటేశ్వర్లు నాయక్ క్లూస్ టీం సమాచారం అందించి, క్లూస్ టీం సహాయంతో గంటల వ్యవధిలోనే చోరీ కేసును చేదించారు. స్థానికంగా గ్రామంలో నివాసం ఉండే ఓ వ్యక్తి చోరీకి పాల్పడినట్లు గుర్తించి అతనిని అరెస్టు చేయడంతో పాటు చోరీకి గురైన నగదును రికవరీ చేసి ఆలయ సిబ్బందికి అందజేశారు.