మఖ్తల్: వడ్వాట్ పాఠశాలలో నీటి సంరక్షణ పై విద్యార్థులకు అవగాహన
మాగనూర్ మండలంలోని వడ్వాట్ ఉన్నత పాఠశాలలో నీటి సంరక్షణ మన బాధ్యతపై విద్యార్థులకు ఉపాధ్యాయుల చేత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నీటి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రసన్నలక్ష్మి, డిఆర్పి నరేందర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు యు వెంకటయ్య, ఉపాధ్యాయులు వెంకటేష్ సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు.