శ్రీకాకుళం: ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది: ఎమ్మెల్యే గోండు శంకర్
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రజల జీవన ప్రమాణాలు పెంపోందించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ తెలిపారు.నగరంలోని విశాఖ ఏ కాలనీలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద రామచంద్రాపురం పంచాయతీకి సంబందించిన పలువురు వైసీపీ నాయకులు మంగళవారం ఎమ్మెల్యే గోండు శంకర్ ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోండు శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమంతరంగా జరుగుతుందని, ప్రజలు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.