మంత్రాలయం: మాధవరం గ్రామ సమీపంలో తుంగభద్ర నది వంతెన వద్ద ఎద్దుల బండిని ఢీకొన్న ప్రైవేటు బస్సు
మంత్రాలయం: మండలం మాధవరం గ్రామ సమీపంలో తుంగభద్ర నది వంతెన వద్ద గ్రీన్ లైన్ ప్రైవేట్ బస్సు ఎద్దుల బండిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎద్దు అక్కడికక్కడే మృతి చెందగా, ఎద్దుల బండి ధ్వంసమైంది. బండిపై ఉన్న వీరేష్, భీమరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. శనివారం ఈ ఘటన కారణంగా కర్ణాటక-ఆంధ్ర జాతీయ రహదారిపై కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది. ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరంగా తెలియాల్సి ఉంది.