ప్రొద్దుటూరు: డీఎస్పీ భావన పై ఉన్నత డీఐజీకి ఫిర్యాదు చేయనున్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
Proddatur, YSR | Nov 27, 2025 ఎవరో బయటి నుంచి వచ్చిన ఒక వ్యక్తి తాను అడిషనల్ ఎస్పీనంటూ ప్రొద్దుటూరుకు చెందిన ఇద్దరు ప్రముఖ నగల వ్యాపారులను కిడ్నాప్ చేసి గన్ పెట్టి బెదిరించి ఏడు కోట్ల రూపాయలకు సంబంధించి ఆస్తి పత్రాలను తీసుకెళ్తుంటే వారికి స్థానిక పోలీసులు వత్తాసు పలుకుతుంటే ప్రొద్దుటూరు డిఎస్పి భావన ఏం చేస్తుందంటూ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఫైర్ అయ్యారు. మూడు రోజుల క్రితం ప్రొద్దుటూరులోని ప్రముఖ నగల వ్యాపారులు శ్రీనివాసులు ,వెంకటస్వామి లను ప్రొద్దుటూరు పోలీసులు ముందస్తు సమాచారం లేకుండా వారి అదుపులోకి తీసుకొని, వారిన ఒక ప్రైవేటు స్థలంలో పెట్టి ఒక రోజంతా ఇష్టానుసారంగా కొట్టారని, పోలీసులతోపాటు వసంత్ అనే ఒక