తాడేపల్లిగూడెం: పవన్ కళ్యాణ్ కి కావాల్సింది సీట్లు కాదు నోట్లు: రాష్ట్ర డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.
పవన్ కళ్యాణ్ కి కావాల్సింది సీట్లు కాదు నోట్లు, ఇంకా ఎక్కువ ప్యాకేజీ ఇస్తే ఉన్న సీట్లు కూడా త్యాగం చేస్తాడని ఎద్దేవా చేశారు రాష్ట్ర డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. ఆయన సోమవారం సాయంత్రం పెంటపాడు మండలంలోని జట్లపాలెం, మౌంజీపడు,పడమర విప్పర్రు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజల దగ్గరకు వెళ్తుంటే వారి స్పందన చాలా అద్భుతంగా ఉందన్నారు. పవన్ ఒక సిద్దాంతం లేని వ్యక్తి అని, ప్రజలు జగన్ పట్ల హర్షం వ్యక్తం చేస్తుంటే పవన్ మాత్రం అక్కసు వెళ్లగక్కుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు స్క్రిప్ట్ చదవడం తప్ప సొంత తెలివి లేదన్నారు.