బద్వేల్: బద్వేల్ : పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలి - మునిసిపల్ కమీషనర్ నరసింహారెడ్డి
Badvel, YSR | Jul 13, 2025 కడప జిల్లా బద్వేల్ పురపాలక సంఘం పరిధిలోని పలు వార్డులలో ఆదివారం మునిసిపల్ కమీషనర్ నరసింహారెడ్డి ఫీల్డ్ విజిట్ చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన పలు వార్డులలో పర్యటించి ఖాళీ స్థలాలలో కంపచెట్లు, పిచ్చి మొక్కలు లేకుండా స్వచ్ఛందంగా తొలగించుకొని పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థల యజమానులకు తెలిపారు.ఖాళీ స్థలాలలో కంపచెట్లు, పిచ్చి మొక్కలు లేకుండా స్థల యజమానులు స్వచ్ఛందంగా తొలగించుకొని పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.